Quantcast
Channel: వార్తలు – Telugu News
Viewing all articles
Browse latest Browse all 13

ఈ శతాబ్దపు అతిపెద్ద చంద్ర గ్రహణం రేపే : ఇండియాలో సమయాలు

$
0
0

ఈ నెల జులై 27వ. తేదీ శుక్రవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడనుంది.  ఇది 21 శతాబ్దంలోనే అతి పెద్ద గ్రహణంగా చెప్పుతున్నారు. ఇది కొన్ని దేశాలలో శనివారం తెల్లవారు జామున కూడా కనబడనుంది .  ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని దేశం లోని చాలా ఆలయాలను రెండు రోజుల పాటు మూసివేయనున్నారు.  ఈ చంద్రగ్రహణం ఢిల్లీలో శుక్రవారం రాత్రి 11.54 గంటలకు ప్రారంభమయ్యి  తెల్లవారు జామున 3.49 గంటలకు విడువనుంది. అర్ధరాత్రి ఒంటిగంట నుండి 2.43 గంటల వరకు చంద్రుడు పూర్తిగా కనుమరుగు అవ్వనున్నాడు. అదే సమయం లో చంద్రుడు అరుణవర్ణంలో కనిపించనున్నాడు. దీనినే బ్లడ్ మూన్ అని అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణాన్ని చూడటానికి  ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ సంపూర్ణ చంద్రగ్రహణ సమయం లో కొన్ని నమ్మకాలు కల వారు గ్రహణం పూర్తయ్యేవరకు  ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. ఈ గ్రహణం జులై 27వ. తారీఖున  యూరప్, ఆఫ్రికా లలో సూర్యాస్తమయం తరువాత అర్ధరాత్రి  వేళలో కనిపించనుంది. జులై  28వ తారీఖున ఆసియా మరియు ఆస్ట్రేలియాల్లో  అర్ధరాత్రి  సూర్యోదయ వేళలో కనిపించనుంది.  ఉత్తర అమెరికాలో  ఈ గ్రహణం కనబడదు.

The post ఈ శతాబ్దపు అతిపెద్ద చంద్ర గ్రహణం రేపే : ఇండియాలో సమయాలు appeared first on Telugu News.


Viewing all articles
Browse latest Browse all 13

Latest Images

Trending Articles





Latest Images